1.దేవుని లెక్క
ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లోఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీ ఇద్దరితో పాటు నేను మీతో కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం ఈ చోటు మాదికాదు, మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమన్నారు. ముగ్గురు కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలి వాన మొదలయ్యింది.
వాళ్లు ఇక అక్కడ నుంచి వెళ్లిపోలేకపోయారు. ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం అతడి దగ్గర మూడు నా దగ్గర ఐదు రొట్టెలున్నాయి ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు. కానీ ఎనిమిది రొట్టెలను మగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేద్దాం అప్పుడు వచ్చిన ఇరవైనాలుగు ముక్కలను ముగ్గురం సమానంగా తిందాం అని అంటాడు. అది అందరికి సబబుగా తోచి ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేసి తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు.
తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్లిపోబోతూ మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న ఎనిమిది బంగారు నాణాలు మీకు ఇస్తాను. మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి వెళ్లిపోతాడు.
అతడు వెళ్లిపోయాక మొదటి వ్యక్తి నా నాలుగు బంగారు నాణాలు నాకిస్తే నేను వెళ్లిపోతాను అంటాడు రెండో వాడితో. అయితే రెండో వ్యక్తి నీవి మూడు రొట్టెలే నావి ఐదు రొట్టెలు కాబట్టి లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు నాణాలు, నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి అని అంటాడు.
ఇలా వీళ్లిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది. ఈ చిక్కు తీర్చుకోడానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథ విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు.
రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండో వాడు చెబుతున్నదే న్యాయంగా తోస్తున్నది అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి నువ్వు కథ సరిగా విన్నావా అని అడిగి మూడు రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక్క బంగారు నాణెం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు. న్యాయాధికారి అదెలా అని అడుగుతాడు.
ఎలాంగంటే మొదటి వాడి దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలు వాటిని అతడు 15 ముక్కలు చేశాడు. అయితే మొదటి వాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కానీ రెండో వాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు. కాబట్టి ఏడు నాణాలు రెండో వాడికి చెందాలి ఇదే నాలెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు. తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటి వాడు ఇతడే నయం 3 నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒక్కటే ఇస్తున్నారు అని వాపోయాడు.
అది విని న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించాడు. దీన్ని బట్టి అర్థం అయ్యిందేమిటంటే మనం వేసుకునే లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. మనదగ్గర ఉన్నదాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నమన్నదే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు.
30 కోట్లు ఉన్నవాడు 3 లక్షలు దానం చెయ్యడం గొప్పగా దేవుడు పరిగణించడు, 3 వేలు ఉన్నవాడు 300 దానం చెయ్యడాన్నే గొప్పగా భావిస్తాడు. పుణ్యంగా జమకడతాడు. దేవుడి దృష్టిలో మనకెంత ఉంది అన్నది కాదు మనం ఎంత దానం చేశాం అనేదానికే విలువ.
Source : Across the web
2.Curse becomes Blessing
ఒక ఊరిలో ఒక వ్యాపారి వున్నాడు అతనికి భార్య, కొత్తగా పెళ్లిఅయిన కూతురు కావ్య వున్నారు.
వ్యాపారి, వ్యాపారం నిమిత్తమై దూరప్రాంతానికి వెళుతుంటే కూతురు వచ్చి తండ్రి కాళ్లకు నమస్కరించింది. తండ్రి అమ్మాయి తో నీగడప కున్న పసుపుకుంకం చెరిగిపోవాలి, నీ వాకిట్లో ముగ్గు చేదిరిపోవాలి, నీ ఇల్లు చెత్త చెదారంతో నిండిపోవాలి, నీకు శాంతం పోవాయి కోపం రావాలి, అంటూ ఇలాగే ఎవేవో అంటుంటే కూతురుకి తండ్రి అన్నమాటలకి బాధకలిగి తన గదిలోకివెళ్ళి తలుపు వేసేసుకుంది.
ఆ తర్వాత ఏప్పుడు తండ్రి ఫోన్చేసినా మాట్లాడేదికాదు.
తండ్రి వ్యాపారానికి వెళ్లిన 9 నెలలకి కావ్యకి కొడుకు పుట్టాడు.
బోర్లాపడడం, ఆతరువాత పాకడం మొదలుపెట్టాడు. కావ్య శుక్రవారం గడపకి పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టింది. కొడుకు పాక్కుంటు వెళ్లి పసుపుకుంకం మొత్తం చెరిపేసి ఒళ్ళంతా పట్టించేసు కున్నాడు. మర్నాడు గడపదాటి బైటవేసిన ముగ్గు మొత్తం చేరిపేసాడు. నడవడం వచ్చేసరికి అల్లరి ఎక్కువై పోయి, ఇల్లంతా బొమ్మలతో చింపేసిన కాగితాలతో చెత్త చెత్త చేసేసాడు.
తల్లిపనై కూర్చోగానే వెనక నుంచి వచ్చి జుట్టు పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. దాంతో కావ్యకి శాంతం పోయి కోపమొచ్చి, కొడుకుని ఒక్కదెబ్బకొట్టింది. వాడుఏడుస్తుంటే వెళ్లి సముదాఇంచింది.
ఈరోజు ఆదివారము కదా నువ్వు అల్లుడుగారుబాబుని తీసుకొని రండి అని తల్లి నుండి ఫోన్ వస్తే తల్లిగారి ఇంటికి వెళ్లారు.
ఏమిచేస్తున్నాడు మనువడు అంటు అమ్మమా పిల్లాడిని తీసుకుని ఎత్తుకునేసరికి, కావ్య కొడుకు చేసే అల్లరి పనులన్నీ ఏకరవు పెడుతుంటే తల్లి వింటూ నవ్వుతుంటే, తల్లికేసి విచిత్రం గా! చూసింది.
వ్యాపారానికి వెళుతూ తండ్రిఅన్న మాటలు గుర్తుకువచ్చాయి. వేంటనే పశ్చాత్తాపం తో అమ్మ ఫోన్ ఇలా ఇయ్యి నాన్నగారికి ఫోన్ చేస్తాను అంది.
ఇప్పుడు మీనాన్న గారు వస్తారు. అందుకే మీకు ఫోన్ చేసాను అంది తల్లి.
తండ్రి వస్తూనే ఏడి నా గడుగ్గాయి మనవడు అంటూ, మనవడిని ఎత్తుకుని తండ్రి మురిసిపోతుంటే!
నాన్న నన్ను క్షమించండి. మీమాటలు ఆశీస్సులు అని అర్ధం చేసుకోలేకపోయాను.
అని తండ్రిభుజం మీదవాలి బాధపడుతున్న కూతురి
తలనిమిరి, ఈసారి నీ నటింటా సిరులు లోలికించు శ్రీమహాలక్ష్మి లాంటి చూడచక్కని చుక్క అందమయిన కూతురుపుట్టాలి అని తండ్రి దివించగా కూతురు ముఖం లో నవ్వుల పువ్వుల వర్షం కురిసింది.
Source : Across Web
Moral Stories from Pedda Bala Shiksha
3.Never Lie
ఒక గ్రామములో ఒక తండ్రి కొడుకుతో కలిసి నివసించుచుండెను. ఒకనాడు తండ్రి అడవికి మేకలను మేపుటకు వెళ్ళుచూ తన
కుమారుని కూడ వెంటబెట్టుకుని పోయెను. అడవిలో కొంతదూరము వెళ్ళిన తరువాత తండ్రి కొడుకును మేకలకు కాపలాబెట్టి తాను
వంటచెజకు కొజకు పోవుచున్నానని ఒకవేళ పులి వచ్చినచొ తనను పిలవమని అతనికి చెప్పి వెళ్లెను.
కొంతసేపయిన తరువాత నాయన వచ్చునా లేదా అని తలంచి కొడుకు "నాయనా! పులివచ్చె"నని బిగ్గరగా అరచెను. అదివిని ఆ
తండ్రి వచ్చి చూడగా పులిలేదు గిలీలేదు అనెను. అలాగే మరియొకసారి "నాయనా! పులివచ్చె" అని బిగ్గరగా అరచెను. అదివిని ఆ
తండ్రి వచ్చి చూడగా పులిలేదు గిలీలేదు అనెను. అలాగే మరియొకసారి "నాయనా! పులివచ్చె" అని బిగ్గరగా అరచెను. అదివిని ఆ
తండ్రి మరల త్వరత్వరగా అచ్చటకు వచ్చి చూడగా పులిలేదు గిలీలేదు అనెను. తండ్రి కొడుకును కోపించి వెళ్ళినాడు. ఇంతలో పులి
నిజముగా రానే వచ్చినది. అప్పుడు కొడుకు బిగ్గరగా "నాయనా! పులివచ్చె పులివచ్చె" అని బిగ్గరగా బెంబేలుపడి అరచినాడు.తండ్రి
మునుపటివలె ఊరకనే అరచుచున్నాడని తలంచి అతని మాటలు చెవినపెట్టక ఊరకుండెను. పులి మేకలను చంపి తినివేసిపోయెను.
నీతి; ఒకసారి అబద్ధము చెప్పిన మరియొకసారి వాని మాటలు ఎవరు నమ్మరు కావున నవ్వులాటకైనా అబద్ధము చెప్పరాదు అను
నీతి గుర్తింపవలెను.
4.తండ్రి కొడుకుల కథ
పూర్వము ఒక గ్రామములో ఒక తండ్రి తన నలుగురు కొడుకులతో జీవించుచుండెను. అతను తన నలుగురు కొడుకులలో పెద్ద కొడుకునకు తన యావదాస్తిని యిచ్చివేసెను. రెండవ కొడుకునకు తన జీవిత వృత్తిని నేర్పెను. మూడవవానికి విద్యను నేర్పెను.నాల్ధవవానికి వ్యాపారమునకు కావలసిన వాటిని సమకూర్చెను. కొద్దికాలము తరువాత పెద్దవఅడు తన ఆస్తిని పూర్తిగా ఖర్చువేసుకొని బీదవాడయ్యెను.
రెండవవాడు తన వృత్తిని పాటించక వీదవాడయ్యెను. మూడవవాడు తను నేర్చుకున్న విద్యతో ధనము సంపాదించి సుఖపడెను.
నాల్ధవ వాడు వ్యాపారములో నష్టమువచ్చి బీదవాడయ్యెను.
నీతి: విద్య నేర్చిన వారు ఎంతో సుఖపడుదురు కావున విద్యనేర్చి ప్రతి మానవుడు వివేకవంతుడు కావలెను.
5.Stay away from evil people
ఒక పల్లైవాడు చెలువు గట్టుపై నడుచుచు వెళ్ళుచుండెను. అతనికి ఒక చిన్న పాముపిల్ల కంటబడెను. దానిని ఇంటికి తీసుకొని వచ్చిపాలు పోసి పెంచుచుండెను. కొద్దికాలము తరువాత పాము పెద్దది అయి విషముతో కూడిన కోరలు కలదియెై పెంచిన ఆ పల్లెవానినేకాటువేయుటకు సిద్ధపడెను. అప్పుడు ఆ పల్లైవాడు దానిని చంపివేసెను.
నీతి: దుష్టులకు ఎప్పుడును మేలు చేయరాదు అట్లు చేసినచో చేసినవానికే కీడు తలపెట్టునను నీతిని గుర్తింపుము.
6.నక్క ద్రాక్షపండు కథ
ఒక అడవిలో ఒక నక్క నివసించుచుండెడిది. అ నక్కకు ఆహారము లభించలేదు. నక్క ఆహారమునకొఅకు అల్లాడుచు సమీపమునఉన్న గ్రామమునకు అహారమును వెదకుచు పోవుచుండెను. రెండు రోజులనుండి ఆహారములేక నక్క ఆకలి బాధకు తాళలేకున్నది.అప్పుడు దానికి ఒక చెట్టునకు ద్రాక్షతీగ అల్లుకొని కనబడెను. దాని నిండ ద్రాక్షపండ్లు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుచుండెను. నక్కవానిని చూచి ఆనందముతో గంతులు వేసెను.
ద్రాక్షపండు చాల ఎత్తున ఉండెను. నక్క వానిని అందుకొనవలెనని ఎగిర్హి ఎగిరి విసుగు చెందినది. ఎంత ఎగిరినను అవి అందలేదు.అప్పుడు నక్‌క "అందని ద్రాక్ష పండ్హు పులుపు, వీటిని తినకూడదు" అని అనుకొని వెళ్ళిపోయెను.
నీతి; చేతకాని వానికి మాటలెక్కువ. తమ కార్యము సాధించలేక ఎదుటివారిపై నిందవేయుదురు అను నీతిని గుర్తింపవలెను.
ఒక ఊరిలో ఒక వైశ్యునకు ఇద్దరు కొడుకులుండెడివారు. వారిలో ఒకడు సోముడు. మరొకడు భీముడు. ఆ ఇద్దరూ ఒకనాడు మామిడి పండ కొజకు ప్రక్కన ఉన్న మామిడి తోటకు వెళ్ళిరి. అప్పుడు భీముడు వాటిని చూచి "తమ్ముడా! ఈ మామిడి చెట్టుకు మంచి పండ్లున్నవి. కోయుదమా!" అని అనెను.
సోముడు "అన్నా! ఈ తోటమాలి చూచినచో మనను పట్టికొట్టును" అని చెప్పెను.
భీముడు వాని మాటలు లెక్కచేయక పండ్లు కోయుటకు చెట్టు ఎక్కెను. ఇంతలో తోటమాలి వారిని
పట్టుకొని కొట్టిను.
నీతి; మంచివారి హితము వినకున్న చెడు కలుగును.
7.Action Speaks more than words
ఒక అడవిలో ఒక కుందేలు అక్కడి చెజువులో తాబేలు నివసించుచుండెను. కుందేలు ఒకనాడు తాబేలుతో "నాతో సమానముగాఎవరును పరుగెత్తలేరు" అని ప్రగల్భృములు పలికినది. అంతటితో ఊరుకొనక "నమ్మదలచినచో నాతో పందెము కాయుము గెలుపుఎవరికి లభించునో తెలియును. ఒక మైలు పరిగెత్తెదము రమ్ము" అని తాబేలును ఉసిగొల్పెను. తాబేలు సరే అనెను.
పందెము ప్రారంభమయినది. కుందేలు గంతులు వేయుచు ముందుకు పరుగెత్తెను. తాబేలు మెల్లగా నడచుచుండెను. కుందేలువేగముగా కొత దూరము పరుగెత్తి వెనుకకు మరలి చూడగా తాబేలు జాడ కనిపించకపోవుటచే అక్కడేయున్న పొదలమాటునకొద్దిసేపు నిద్రించెను. ఇంతలో పట్టుదలతో పందెము నెగ్గవలెనన్న ఆశయముతోవున్న తాబేలు రానే వచ్చినది. నిద్రించుచున్కుందేలును చూచి వేగముగా నడిచి తన గమ్యస్థానము చేరుకొనెను. కుందేలునకు మెలుకువ వచ్చి చూడగా తాబేలు కనబడలేదు.ఎక్కడనో వెనుక ఉండవచ్చునని భావించి గంతులేస్తూ ప్రయాణము సాగించెను. గమ్యష్థానము వద్దనున్న తాబేలును చూచికుందేలు ఆశ్చర్యపోయెను.
నీతి: ప్రగల్భములు పలుకువారు పరుగుపెట్టలేరు అనగా గొప్పలు చెప్పుకొనువారు కార్యాన్ని సాధించలేరని భావము.
8.కటిలు కొటువాడు బంగారు గొడలి
ఒక ఊరిలో రామయ్య మజఖియు సోమయ్య అను ఇరువురు వ్యక్తులు కలరు. రామయ్య కష్టజీవి. రోజూ అడవికి వెళ్ళి కట్టిలుకొట్టుకొనితెచ్చి వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుకొనెడి వాడు.
ఒకనాడు రామయ్య కట్టిలు కొట్టుచుండగా గొడ్డలి పట్టుసడలి ప్రక్కన ఉన్న నదిలో పడినది. 'గొడ్డలి పోయినదే' అని రామమ్యవలవల ఏడ్చుచుండిను. అతని దుఃఖము చూచి ఆ నదీజలదేవత ప్రత్యక్షమై, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడుగి వివరములుతెలుసుకొని, వెంటనే నీటిలో మునిగి ఒక బంగారు గొడ్డలి తెచ్చి యిచ్చెను. రామయయ "ఈ గొడ్డలి నాదికాదు తల్లీ" అని అనెను.జలదేవత మరల నీటిలో మునిగి ఒక వెండి గొడ్డలి తెచ్చి యిచ్చెను. రామయ్య "ఈ గొడ్డలి కూడ వాది కాదు తల్లీ" అని అనెను.మరల జల దేవత నీటిలో మునిగి ఇనుపగొడ్డలి తీసికొని వచ్చెను. అప్పుడు రామయ్య ఆశతో " ఈగొడ్డలి నాదే తల్లీ" అనిజలదేవతతో పలికెను. అప్పుడు జలదేవత రామయ్య యొక్క నిజాయితీని ప్రశంసించి తనుజూపిన బంగారు వెండి గొడ్డళ్ళనుఇనుపగొడ్డలితో కలిపి బహుమానముగా ఇచ్చి నిజాయితీగా జీవించమని చెప్పి అదృశ్యమయ్యెను.
కట్టెలు కొట్టుకొని జీవించే రామయ్య ఆ తరువాత మంచి తిండి, బట్టి, గూడు మొదలగు వాటిని సమకూర్చుకొని జీవించుచుండెను.ఈ మార్పులను చూసిన సోమయ్యకు ఆశ కలిగినది. అహుశా అతనికి అడవిలో ఏ నిధి అయినా దొరికియుండవలెనని తనమనస్సులో అనుకున్నాడు, ఈ విషయాన్ని రామయ్యద్వారా రాబట్టేను. మరుసటి రోజున సోమయ్య కూడ కట్టెలు కొట్టడానికిఅడవికి వెళ్లినాడు. అతను ఒకచెట్టు ఎక్కి Soo కొట్టుచుట్టున్నగా నటించి తన గొడ్డలిని ఆ నదిలోకి విసంను. పిమ్మట సోమయ్యఏడవటము ప్రారంభించెను. ఆ సమయములో జలదేవత ప్రత్యక్షమై ఎందుకు దుఃఖిస్తున్నావని ప్రశ్నించెను. సోమయ్య తన గొడ్డలిఈ నదిలో పడినదని చెప్పెను. అప్పుడు జలదేచత ఒక బంగారు గొడ్డలి తెచ్చి చూపెను. ఆ గొడ్డలి నీదేనా అని అడుగగా "అవునుతల్లీ ఈ గొడ్డలి నాదే" అని జవాబిచ్చెను. ఆ తరువాత జలదేవత నీటిలో మునిగి వెండి గొడ్డలి తెచ్చి చూపెను. ఈ గొడ్డలి కూడనీదేనా అని అడుగెను. అప్పుడు సోమయ్య "అవును 5D Ss గొడ్డలి కూడా నాదే" అని బదులు చెప్పెను. జలదేవత మరొకసారినీటిలో మునిగి అతను పోగొట్టుకున్న ఇనుప గొడ్డలిని తీసికొనివచ్చి ఈ గొడ్డలి నీదేనా అని అడిగెను. "ఈ గొడ్డలి నాది కాదు" అనిబదులు చెప్పెను. దానితో కోపించిన జలదేవత అతనికి బంగారు, వెండి గొడ్డళ్ళు కాదుకదా ఇనుప గొడ్డలి కూడ యివ్వకుండఅద్భృృశ్యమయ్యెను. దీనితో సోమయ్య నది ఒడ్డున కూర్చొని రోదించసాగిను.
నీతి; దురాశ దుఃఖమునకు చేటు.
9. A Friend in need is a Friend indeed
ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు కలరు. అందులో ఒకడు గ్రుడ్డివాడు. మరియొకడు కుంటివాడు. రోజూ ఇద్దరు కలిసి ఏదో ఒక పనిచేసికొనుచు కాలము గడుపుచున్నారు. ఇట్టుండగా ఒకనాడు ఆ ఊరి పెద్ద అయిన దొరగారు ఊరిలోని సమస్త జనులను విందుకుఆహ్వానించినాడు. ఊరిలోని సమస్త జనులు విందుకు హాజరగుచుండిరి. ఊరి దొరగారు అందరినీ విందుకు ఆహ్వానించినారుకదా!మనము కూడ విందుకు హాజరుకావలెనని వారు తలంచిరి. కాని వీరి పరిస్థితి అందుకు భిన్నముగా యున్నది. వీరిలో ఒకడునడవలేడు, రెండవవాడు చూడలేడు. అందువల్ల విందుకు హాజరుకావడము ఎలా? అని ఆలోచించుచుండిరి.
ఇంతలో గ్రుడ్జివానికి ఒక చక్కని ఆలోచన వచ్చినది. దానిని కుంటివానికి చెప్పి, వానిని ఒప్పించి విందుకు హోజరుకావలెననిఅనుకున్నాడు. అప్పుడు గ్రుడ్డివాడు కుంటివానితో నీవు నాభుజములపై కూర్చొని నాకు విందుజరిగే ప్రదేశమునకు దారిచూపుముఅనెను. ఈ ఆలోచన కుంటివానికి కూడ నచ్చెను. వెంటనే ఆచరణలో పెట్టిరి. వారిరువురు విందుకు హాజరయి చక్కటిపదార్థములను భుజించి సంతోషించినారు.
నీతి; ఆపదలో ఆదుకున్నవాడే మిత్రుడు.

No comments:
Post a Comment