Story No.1
ఒక గ్రామములో ఒక తండ్రి కొడుకుతో కలిసి నివసించుచుండెను. ఒకనాడు తండ్రి అడవికి మేకలను మేపుటకు వెళ్ళుచూ తన
కుమారుని కూడ వెంటబెట్టుకుని పోయెను. అడవిలో కొంతదూరము వెళ్ళిన తరువాత తండ్రి కొడుకును మేకలకు కాపలాబెట్టి తాను
వంటచెజకు కొజకు పోవుచున్నానని ఒకవేళ పులి వచ్చినచొ తనను పిలవమని అతనికి చెప్పి వెళ్లెను.
కొంతసేపయిన తరువాత నాయన వచ్చునా లేదా అని తలంచి కొడుకు "నాయనా! పులివచ్చె"నని బిగ్గరగా అరచెను. అదివిని ఆ
తండ్రి వచ్చి చూడగా పులిలేదు గిలీలేదు అనెను. అలాగే మరియొకసారి "నాయనా! పులివచ్చె" అని బిగ్గరగా అరచెను. అదివిని ఆ
తండ్రి వచ్చి చూడగా పులిలేదు గిలీలేదు అనెను. అలాగే మరియొకసారి "నాయనా! పులివచ్చె" అని బిగ్గరగా అరచెను. అదివిని ఆ
తండ్రి మరల త్వరత్వరగా అచ్చటకు వచ్చి చూడగా పులిలేదు గిలీలేదు అనెను. తండ్రి కొడుకును కోపించి వెళ్ళినాడు. ఇంతలో పులి
నిజముగా రానే వచ్చినది. అప్పుడు కొడుకు బిగ్గరగా "నాయనా! పులివచ్చె పులివచ్చె" అని బిగ్గరగా బెంబేలుపడి అరచినాడు.తండ్రి
మునుపటివలె ఊరకనే అరచుచున్నాడని తలంచి అతని మాటలు చెవినపెట్టక ఊరకుండెను. పులి మేకలను చంపి తినివేసిపోయెను.
నీతి; ఒకసారి అబద్ధము చెప్పిన మరియొకసారి వాని మాటలు ఎవరు నమ్మరు కావున నవ్వులాటకైనా అబద్ధము చెప్పరాదు అను
నీతి గుర్తింపవలెను.
No comments:
Post a Comment